అధికారులు తప్పు చేసి నాపై బురద జల్లుతారా

సాలూరు పురపాలికలో‌ అధికారులు ఏ పని సక్రమంగా చేయరు. పాలనలో ఏమైనా తప్పులు ఉంటే అధికారులు తప్పించుకునేందుకు అమ్ముడుపోయి నాపై బురద జల్లుతారా అంటూ పుర అధ్యక్షురాలు పువ్వుల ఈశ్వరమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం చైర్పర్సన్ చాంబర్లో విలేకరులతో సమావేశమై తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో 20వ నెంబర్ దుకాణం తాళాలు ఎప్పుడో అప్పగించారు వాటిని తీసుకోండి అని పలుమార్లు చెప్పాను తాళాలు తీసుకోకుండా, ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకుండా తప్పించుకు తిరిగారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడేమో దుకాణం అడ్డగోలుగా నిర్వహిస్తున్నారు అంటూ పాలకవర్గ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్న అధికారుల దగ్గర తాళాలు లేవని ఎందుకు అబద్ధాలు చెప్పారని ప్రశ్నించారు. షాప్ తాళాలు గత ఆర్ ఐ హయాంలోనే అప్పగించారు వాటిని కొత్తగా బాధ్యతలు తీసుకున్న తరువాత మీకు తాళాలు తీసుకోమని చెప్పాను ఎందుకు తీసుకోలేదు అన్నారు. పుర అధ్యక్షురాలిగా తనకు ఎటువంటి గౌరవం దక్కడం లేదు, అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు. సిసి ఉన్నా ఎటువంటి ప్రయోజనం లేదని అవేదన వ్యక్తం చేశారు. నా వార్డులో ఓ వృద్ధురాలు కుళాయి కనెక్షన్ వేయాలని అధికారులు ఆదేశించిన ఇప్పటికీ వేయలేదన్నారు.  అసలు పురపాలికలో ఏ పనులు అధికారులు సక్రమంగా చేయడం లేదని అన్నారు.  వైస్ చైర్మన్ దగ్గర ఓ మాట చైర్పర్సన్ దగ్గర ఒక మాట రకరకాలుగా చెబుతూ పాలకవర్గాన్నే అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసి విధులకు రాకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని మేనేజర్ రాఘవచార్యులను ప్రశ్నించారు. రెవెన్యూ విభాగానికి టౌన్ ప్లాన్ విభాగానికి వచ్చిన దరఖాస్తులు చైర్పర్సన్ గా పరిశీలించే హక్కు నాకు లేదా, నేను అడిగితే ఎందుకు ఇవ్వడం లేదు అని ఆర్ ఐ శ్రీనివాసరావు ను ప్రశ్నించారు. నాపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *