విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది మార్చి 6న మద్యం, ఇసుక, గంజాయి, పశువులు అక్రమ రవాణా, కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు.
పోలీసులు, సెబ్ అధికారులు తనిఖీల్లో భాగంగా దాడులు నిర్వహించి, 14 కేసులు నమోదు చేసి, 13 మందిని అరెస్టు చేసి, 45.9 లీటర్ల IMFL మద్యం, 25 లీటర్ల ID యారక్ స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 4000 లీటర్ల ఊట బెల్లం ధ్వంసం చేశారు.
గజపతినగరం పి.ఎస్. పరిధిలో ఇసుక అక్రమ రవాణకు పాల్పడుతున్న ఒకరిని అదుపులోకి తీసుకొని, ఒక లారీ, 12 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నారు.
కొత్తవలస (SB), భోగాపురం (SB), విజయనగరం వన్ టౌన్ పి.ఎస్. పరిధిలో పేకాట, కోడి పందాల ఆడుతున్న వారిపై పోలీసులు రైడ్ చేసి, రూ.1,64,350/- ల నగదు, 2 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై 43 కేసులు నమోదు చేశారు.
మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 12 కేసులు నమోదు చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాలతో పోలీసు అధికారులు వాహన తనిఖీలు చేపట్టి, ఎం.వి.నిబంధనలు అతిక్రమించిన 224 మందిపై రూ. 61,605/- లను ఈ-చలానాలు గా విధించారు.
జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాలతో అదనపు ఎస్పీ గారు మరియు ఇతర పోలీసు అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక గ్రామాలు సందర్శించి, 2024 ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.