సాలూరు పాచిపెంట మక్కువ మండలాలకు ఇకపై నిరంతర విద్యుత్ సరఫరా సేవలు అందుబాటులో ఉంటాయని ఆ శాఖ ఎస్సీ లక్ష్మణరావు తెలిపారు. గురువారం పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరు పట్టణ సమీపంలోని 132/33 కెవిఎ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. విద్యుత్ వినియోగము పెరిగిందని అందుకే సబ్ స్టేషన్ లో 11 ఎంబీఏ స్థానంలో 31 ఎంబీఏ విద్యుత్ సరఫరా ట్రాన్స్ఫార్మర్లను అమర్చినట్లు తెలిపారు. ఇకపై వ్యవసాయ కనెక్షన్లకు అలాగే గృహ వాణిజ్య విద్యుత్ కనెక్షన్లకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు.