పార్వతీపురం రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు స్ట్రాంగ్ రూంలో భద్రపరచిన ఇవిఎమ్ లు, వివిప్యాట్ లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం పరిశీలించారు. పీరియాడికల్ తనిఖీల్లో భాగంగా ఇవిఎమ్ లు తనిఖీలు జరిపడం జరిగిందని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే తదుపరి ప్రక్రియ ప్రారంభించి నియోజక వర్గాలకు పంపించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డి అర్ ఓ జీ.కేశవ నాయుడు, బిజెపి పార్టీ, వైయస్సార్, జనసేన ప్రతినిధిలు పారిసర్ల అప్పారావు, శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, తాసిల్దార్ కె.ఆనందరావు, డిప్యూటీ తాసిల్దార్ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.