పట్టణంలో రామ కాలనీ అంగన్వాడి కార్యకర్త బలగ రాధ కు ఉత్తమ సేవ పురస్కారం దక్కింది.
పార్వతిపురం మన్యం జిల్లా కేంద్రంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పి డి ఎం.ఎన్ రాణి ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ఉత్తమ సేవా అవార్డులు అందించడం జరిగింది. పిల్లలకు ఆటపాటలతో పాటు మెరుగైన విద్యను అందించడంతోపాటు గర్భిణీలకు, బాలికలకు పోషకాహారం సక్రమంగా అందించడం వలనే ఈ అవార్డు దక్కిందని అన్నారు, సేవా అవార్డు పొందిన రాధకు సాలూరు ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్టు సిడిపిఓ సత్యవతి మరియు కార్యాలయ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు అభినందించారు.