క‌ర్నూలు లో ‘లా’ యూనివ‌ర్సిటీకి భూమిపూజ‌

లా యూనివ‌ర్సిటీ భూమిపూజ కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: క‌ర్నూలులో లా యూనివ‌ర్సిటీ నిర్మాణ ముఖ్య‌మంత్రి వైయస్ జ‌గ‌న్‌మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. క‌ర్నూలు జగన్నాథగట్టులో లా యూనివర్సిటీ పనులకు సిఎం వైయ‌స్ జ‌గ‌న్‌ శ్రీకారం చుట్టారు. భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంత‌రం లా యూనివర్సిటీ పైలాన్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. క‌ర్నూలు జిల్లా క‌ల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీని నిర్మిస్తున్నారు. లా యూనివ‌ర్సిటీ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం అనంత‌రం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.

అభివృద్ధి వీకేంద్రీకరణే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ ఉద్దేశమ‌న్నారు. హైదరాబాద్‌కు రాజధానిని తరలించే సమయంలో క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని తీర్మానించారని గుర్తుచేశారు. కర్నూలును న్యాయ‌రాజ‌ధాని చేస్తామ‌ని ఇది వరకే చెప్పామ‌ని, శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నామ‌న్నారు. శ్రీ‌బాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంద‌ని సీఎం వివ‌రించారు. 

కర్నూలులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. నేషనల్ లా యూనివర్శిటీ నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కోరారు. లా యూనివర్సిటీ కోసం వెయ్యి కోట్లు కేటాయించామ‌ని తెలిపారు. ఈ యూనివర్శిటీతో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఏపీ లీగల్ మొట్రాలజికల్ కమిషన్, లేబర్ కమిషన్, లేబర్ కమిషన్, వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డు, మానవహక్కుల కమిషన్, ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా, వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నాన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *