కూటమి విజయంతో రాష్ట్రానికి భవిష్యత్తు

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందని, సాలూరు  నియోజకవర్గంలో ప్రజల ఆదరణ చూస్తుంటే మన విజయం ఖాయం అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీ ప్రజలు చాలా కష్టాలు పడ్డారని, మన యువత భవితకు కావాల్సిన నమ్మకం, భరోసా ను ఈ జగన్ రెడ్డి ఈ జన్మకు ఇవ్వలేడని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాలు చేశాడని, ఒకటో తారీకు నాటికి ఎవరికీ జీతాలు అందడం లేదని,  తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు అందిస్తామని, పెన్షన్ దారులకు ప్రతినెల ఒకటో తారీకు కు పెన్షన్ అందుతుందని, టిడిపి, జనసేన, బిజెపి చేతులు కలిపింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. దివాలా తీసిన రాష్ట్రానికి జవసత్వాలు అందించాలనే లక్ష్యంతో మూడు పార్టీలు జత కట్టాయని ఆమె అన్నారు దే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు కరెంటు చార్జీలు పెంచారు. మన కూటమి అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలో పెంపు ఉండదని హామీ ఇస్తున్నాము. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తెరుస్తాం. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నాసిరకం మద్యాన్ని నిర్మూలిస్తాం. గంజాయి, డ్రగ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.
ఎన్నో సాగు, తాగు నీటి ప్రాజెక్టులను టిడిపి ప్రారంభించింది. ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ విభజన తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాము. ఐదేళ్లలో టిడిపి సాగునీటి రంగానికి 68 వేల కోట్లు ఖర్చు చేసింది. నీటి లభ్యత ఉంటేనే ఏ ప్రాంతంలో అయినా పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెందుతాయి. అధికారంలోకి వచ్చిన తర్వత ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చేవరకు ప్రతి నెల 300 నిరుద్యోగ భృతి ఇస్తాము. తల్లికి వందనం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఇస్తుంది. అన్నదాత పథకం ద్వారా రైతులకు ఏటా 20,000 అందిస్తాం. దీపం పథకం క్రింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు 1500, ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఉంటుంది. బిసి వర్గాలకు 50 ఏళ్ల నుంచి పెన్షన్ అందజేస్తాం. మహిళలకు కలలకు రెక్కల పథకం కింద వడ్డీ లేని రుణాలు అందజేసి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాం. చేనేత కార్మికులకు అండగా నిలిచి వారికి న్యాయం చేస్తాం. వైయస్సార్సీపీకి వ్యతిరేకంగా చేస్తున్న ఈ పోరాటంలో మనతో కలిసి వచ్చే ప్రజల గొంతుకే ప్రజా గళం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *