గిరిజనుల కష్టాలు జగన్ ప్రభుత్వానికి పట్టవని సాలూరు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రాయి గుడ్డి వలస, ఎగువ కొత్తవలస ,దిగువ కొత్తవలస తదితర గిరిజన గ్రామాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. టిడిపి తోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు జరుగుతుందన్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచి గిరిజన అభివృద్ధిని వైకాపా పక్కన పడేసింది అన్నారు. ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ప్రజలను నిండా మంచేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి దే విజయమని, ప్రజలకు మంచి జరిగే సమయం ఆసన్నమైందన్నారు. వైకాపాకు బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో గిరిజన మహిళలతో సంధ్యారాణి థింసా నృత్యం చేశారు. ఆయా గ్రామాలలో సంధ్యారానికి గిరిజనులు హారతులు పట్టి జేజేలు పలికారు.
కార్యక్రమంలో పాచిపెంట మండల టిడిపి అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ముఖి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.