గోడలపై రాతలకు అనుమతి లేదు

పార్వతీపురం, ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడలపై రాతలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల అంశాలపై జిల్లా కలెక్టర్ లతో మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోన్ని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించ వద్దని ఆయన ఆదేశించారు.

హైవేలు, ప్రధాన రహదారులు ప్రక్కన ఇప్పటి వరకు ఉన్న హోర్డింగ్ లను సమాన ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వున్నందున  నూతన అనుమతులు జారీ చేయరాదని ఆయన సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా  అమలుపరిచడంలో ఎటువంటి అలసత్వం వహించరాదని అన్నారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ ల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ ఉండాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడం,   ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను విస్తృత స్థాయిలో వినియోగించడం, సి విజిల్ ద్వారా అందే  ఫిర్యాదుల సకాలంలో పరిష్కరించడం తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. మద్యం విక్రయాలపై పర్యవేక్షణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇ వి ఎం ల రాండమైజేషన్ ప్రక్రియ ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనా కుమారి, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక, ఇన్ ఛార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి జి కేశవ నాయుడు, పార్వతీపురం రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి ఎ వెంకట రమణ, ఎస్డిసి ఆర్ వి సూర్యనారాయణ, నోడల్ అధికారులు –  జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్ వర ప్రసాద్, జిల్లా మత్స్య శాఖ అధికారి వి. తిరుపతయ్య, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.వి.కరుణాకర్,  జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి యు సాయి కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జిల్లా భూగర్భ జలాల అధికారి ఏ రాజశేఖర రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *