పార్వతీపురం నూతన జాయింట్ కలెక్టర్ గా ఎస్ ఎస్ శోబిక గురువారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన జాయింట్ కలెక్టర్ కు జిల్లా రెవిన్యూ అధికారి జి.కేశవ నాయుడు, రెవిన్యూ డివిజనల్ అధికారులు కె.హేమలత, ఏ. వెంకట రమణ, జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శోబిక ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలు, జిల్లాలో కొనసాగుతున్న కార్యక్రమాలు కొనసాగించుటకు కృషి చేస్తామని తెలిపారు.
జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శోబిక కు పలువురు అభినందనలు తెలిపారు.