తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను మార్చి 15 నుండి 22వ తేదీ వరకు ఈ – వేలం వేయనున్నారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 412 లాట్లు ఉన్నాయి.
ఇందులో ఆర్ట్ సిల్క్ ధోతీలు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, దుపట్టాలు, శాలువలు, బెడ్ షీట్లు, నాప్ కిన్స్, హ్యాండ్ కర్చీఫ్‌లు, పంజాబి డ్రెస్ మెటీరియల్స్, జంకాళాలు, కార్పెట్లు, గొడుగులు ఉన్నాయి.
పూర్తి వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్యప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.