దగ్గర బంధువే ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి బంగారు నగలు దోచుకున్నాడని సాలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలియజేశారు. పాచిపెంట మండలం మాతమూరు గ్రామంలో గత నెల 20న ముఖి సరస్వతమ్మ ఇంట్లో బీరువాలో దాచిన బంగారం పోయిందని పాచిపెంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపిన వివరాలివీ..
చోరీ కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశాం. చోరీ జరిగిన రోజున రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామానికి చెందిన దగ్గర బంధువు చుక్క సింహాచలంపై అనుమానం వ్యక్తం చేస్తూ నిఘా వేశాం . గురువారం సాలూరు పట్టణంలో బంగారం అమ్మేందుకు ప్రయత్నిస్తున్న సింహాచలంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. బంధువుల ఇంట్లో చోరీ చేసింది తానేనని నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో, బంగారు నగలు స్వాదీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు సాలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలియజేశారు.