పాలకవర్గ సభ్యులను అడ్డగింత
పార్వతీపురం మన్యం జిల్లా
సాలూరు:
రెండు నెలల జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అత్యవసర సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన చైర్పర్సన్ పి. ఈశ్వరమ్మ, ఉపాధ్యక్షులు దీప్తి, అప్పలనాయుడు లను అడ్డుకున్నారు. జీతాలు పెరిగాయని ఆనందపడి సంబరాలు చేసుకున్నాం కానీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అధికారులు మాత్రం రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించే వరకు విధులకు హాజరయ్యేది లేదని చెప్పారు. నాలుగు రోజులలో జీతాల సమస్య పరిష్కరిస్తానని చైర్పర్సన్ హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన నిర్మించారు.