పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం సింగనాపురం గ్రామంలో ఈ నెల 22వ తేదీన గంట అప్పలనర్సమ్మను భర్త ముసలి నాయుడు కత్తితో పొడిచి హతమార్చాడు.
భార్యను హత్య చేసిన ముసలి నాయుడు పరారి అయ్యాడు అతని కోసం చినమేరంగి సీఐ మంగరాజు, చినమేరంగి, జియ్యమ్మవలస ఎస్.ఐ లు గాలింపు చేపట్టి బుధవారం ఆయన ను అదుపులోకి తీసుకున్నట్లు పాలకొండ డిస్పి జివి. కృష్ణరావు చినమేరంగి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు
హత్యకు ఉయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని పార్వతీపురం కోర్టుకు తరలించనున్నట్లు డిస్పి కృష్ణరావు తెలియజేసారు.