పార్వతీపురం, మార్చి 26: రానున్న మూడునెలలలో మంచినీటి సరఫరాకు కావలసిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరు కార్యాలయం నుండి నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమీషనర్లు, మండల అభివృద్ది అధికారులు, మండల ఇంజనీరింగు అధికారులతో మంచినీటి సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా
కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగకుండా
ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని
తెలియజేశారు.
మంచినీటి పధకాలు, సోలార్ నీటి సరఫరా పధకాలు, బోరుబావులకు అవసరమైన వాటికి రిపేర్లు చేయించాలని
తెలియజేశారు. రిపేరు పనులను మార్చి 31 నాటికి పూర్తిచేయాలని తెలిపారు. రానున్న మూడు నెలలు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుందని, దానిని అదిగమించుటకు కలెక్షను బావులు వద్ద రీచార్జి చేయుటకు నీటి నిలువకట్టడాలు సరిగా ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి గ్రామంలో నీటి శాంపిల్స్ తీసుకోవాలని, నీటి నాణ్యతను పరీక్షించాలని తెలిపారు. మండల అభివృద్ది అధికారులు, మండల గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్లు నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. గ్రామ పంచాయతీలలో మంచినీటి పధకాలు నిర్వహణకు 15వ ఆర్థిక సంఘనిధులు వినియోగించుకోవాలన్నారు. ప్రజలు ఎక్కువగా భూగర్బ జలాలపై ఆధారపడుతున్నారని, భూగర్బ జలాలను విపరీతంగా వాడుతున్నారని, భవిష్యత్తులో భూగర్బజలాలు అడుగంటే ప్రమాదం ఉందని, కావున భూగర్బ జలమట్టాలు పెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. భూగర్బ జలాలు పెంచుటకు కాంటూరు కందకాలు, వాటర్ షెడ్ వంటి పధకాలు నరేగా ద్వారా చేపట్టాలని తెలిపారు. బెంగుళూరు, చెన్నై వంటి
నగరాలు ప్రస్తుతం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, అక్కడ నీటిని వృదాచేస్తే అధికారులు అపరాదురుసుం విధిస్తున్నారని, అంటువంటి పరిస్థితి భవిష్యత్తులో గ్రామీణప్రాంతాలలో కూడా ఏర్పడే అవకాశం ఉండని, కావున భూగర్బ జలాలు పెంపునకు చర్యలు చేపట్టడం, నీటి పొదుపును పాటించడం ద్వారా భవిష్యత్తు విపత్తులను ఎదుర్కొనుటకు సిద్దంగా ఉండాలని తెలిపారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారులు ఐటిడిఎ ప్రోజెక్టు అదికారులు సి.విష్ణుచరణ్, కల్పనాకుమారి, రెవిన్యూ డివిజనల్ అదికారులు కె.హేమలత, సి.వి.రమణ నియోజకవర్గస్థాయిలో మంచినీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఈ సమావేశంలో డుమా పి.డి. రామచంద్రరావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా పంచాయతీ అధికారి బి. సత్యనారాయణ, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు
.