సాలూరు పట్టణంలోని పాత మీసేవ భవనంలో మహిళా మార్ట్ ను గురువారం ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డి మార్ట్, మోర్, రిలయన్స్ కార్పొరేట్ మార్టులకు ధీటుగా మహిళా సంఘాలు దీనిని నిర్వహిస్తారన్నారు. నవ్యత నాణ్యతకు పెట్టింది పేరుగా సరుకులు మార్టులో తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలో 11 మార్టులు ఉండగా 12వది సాలూరు గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఆనందదాయకం అన్నారు. పురపాలక పరిధిలో మహిళా సంఘాల సభ్యుల నుంచి 150 రూపాయలు చొప్పున నిధులు సేకరించి సుమారు రూ. 19 లక్షలతో ఈ మార్ట్ ఏర్పాటు చేసినట్లు ఎండి విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్ష ఉపాధ్యక్షులు ఈశ్వరమ్మ దీప్తి అప్పలనాయుడు కమిషనర్ ప్రసన్నవాణి, మెప్మాఅధికారులు, సిబ్బంది పాల్గొన్నారు