మేదరమెట్లలో ఈనెల 10న నిర్వహించబోయే వైయఆర్‌కాంగ్రెస్ పార్టీ ‘సిద్ధం’ మహాసభకు 15 లక్షలకు మించి హాజరవుతారని వైయస్‌ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. అద్దంకిలో జరగబోయే సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు.
గత 58 నెలల వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధిని, ఇచ్చిన సంక్షేమ పథకాలను, అన్ని వర్గాలకు చేసిన సమన్యాయాన్ని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధం సభా వేదిక నుంచి వివరిస్తారని చెప్పారు. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో పార్టీ పంథాను, పార్టీ విధివిధానాలను ఎలా పటిష్టం చేసుకొని మంచి సుపరిపాలన అందిస్తామనేది సీఎం వైయస్ జగన్ వివరిస్తారన్నారు. సిద్ధం మహాసభకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయని చెప్పారు. పార్టీ అంచనా ప్రకారం సిద్ధం సభకు హాజరయ్యేవారి సంఖ్య 15 లక్షలు మించుతుందన్నారు. ఇంతకు ముందు నిర్వహించిన సిద్ధం సభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీఎం వైయస్ జగన్ అభిమానులు, ప్రజలు, అపూర్వమైన స్పందన వచ్చిందన్నారు.
సభా ప్రాంగణం నూరు ఎకరాలు మాత్రమే 15 లక్షల మంది ఎలా సరిపోతారని పలువురు ప్రశ్నించారని, సభా ప్రాంగణం పక్కనే మరో 100 ఎకరాలను సిద్ధం చేశామని, అవసరమైతే సభా ప్రాంగణాన్ని ఎక్స్‌టెండ్ చేసుకుంటామన్నారు.
టీడీపీ–జనసేన ఇటీవల 20 ఎకరాల్లో ఓ సభ నిర్వహించి.. ఆ 20 ఎకరాల్లోనే లక్షల మంది వచ్చారని తప్పుడు ప్రచారం చేసుకున్నారని, అలాంటి ప్రకటనలు చేసే ఉద్దేశం, అవసరం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. నిజాన్ని నిజంగా చెప్పే లక్షణం వైయస్‌ఆర్‌సీపీ సొంతమన్నారు.
అద్దంకి సిద్ధం మహాసభకు ముందే వైయస్‌ఆర్ సీపీ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తికావొచ్చిందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. మేనిఫెస్టో కూడా పూర్తయిందన్నారు. అదే విధంగా పార్టీ పోలింగ్ బూత్ కమిటీలను నిర్మాణం చేసుకున్నామని, ఒక్కో పోలింగ్ బూత్‌కు 15 మందిని ఎంపిక చేసుకొని ట్రైనింగ్ కూడా ఇచ్చామన్నారు.
2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీల్లో 99 శాతం నెరవేర్చిన ఘనత సీఎం వైయస్ జగన్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైయస్ జగన్ పాలన పట్ల సంతోషంగా ఉన్నారని, మేనిఫెస్టో అనేదానికి విలువ పెంచిన నాయకుడు సీఎం వైయస్ జగన్ అని చెప్పారు.