శ్రీశైలం వచ్చిన భక్తులకు మల్లికార్జున , భ్రమరాంబిక అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. టూరిస్ట్ బస్టాండు వద్ద వాహనాల పార్కింగ్ కు పెద్దపెద్ద గ్రౌండ్లను అదనంగా ఏర్పాటు చేశారు, శివదీక్ష శిబిరాలు, ఆలయ ముందు భాగంలో భక్తులు విశ్రాంతి కోరకు భారి టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చె భక్తులకు మంచినీరు సౌకర్యం కొరకు నుతన వాటర్ ట్యాంక్ లు, భక్తులు నీరు త్రాగేందుకు ఫిల్టర్ వాటర్ ను ఏర్పాటు చేశారు. పాతాళగంగ వద్ద మహిళలు పిల్లలు పెద్దలు పుణ్య స్నానాలు ఆచరించేందుకు అణువుగా బారికెడ్లు పెన్సింగ్ పనులు ఆలయ అధికారులు చేపడుతున్నారు.
శ్రీశైల క్షేత్రంలో రేపటి నుంచి మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ఆలయం నేత్రా పర్వంగా ముస్తాబయింది. ఆలయం గోపురాలు విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతోంది. దేవతామూర్తుల విగ్రహాలకు తుది మెరుగులు రూపుదిద్దుకుంటున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా సౌకర్యాలు ఏర్పాట్లు చేసేందుకు దేవస్థానం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యేక క్యూలైన్లు మంచినీరు, భోజనం వసతి తదితర భారీ ఏర్పాట్ల పనులపై అధికారులు నిమగ్నమయ్యారు.
అష్టాదశ శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలసి వెలసిన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి మార్చి 11 వరకు 11 రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. భక్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలి వస్తున్నారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు వసతి శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రసాదం తదితర ఏర్పాట్లను పూర్తి చేశారు.