పార్వతీపురం మన్యం జిల్లా కళాశాలల్లో ర్యాగింగ్ చేస్తే కఠిన శిక్షలకు గురవుతారని రెండవ అదనపు జిల్లా జడ్జి మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎస్. దామోదరరావు తెలిపారు.
శనివారం ఉదయం స్థానిక వేదాంత జూనియర్ కళాశాలలో విద్యార్దులకు ఏర్పాటు చేసిన న్యాయ అవగాహనా సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ…
ర్యాగింగ్‌లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను అవమానకరంగా మాట్లాడటం,వేధించడం చేస్తున్నారని, అలా చేయడం చట్ట వ్యతిరేక చర్యలని పేర్కొన్నారు. ఒక్కోసారి అదే ప్రాణాంతకమవుతుoదని తెలిపారు. కొంతమంది విద్యార్థులు తెలిసి తెలియక చేసే పనులు వారి ఉజ్వల భవిష్యత్ ను అంధకారంలో పడేస్తుందన్నారు. విద్యార్థినులు, మహిళలు ప్రతీ ఒక్కరూ దిశా యాప్ డౌన్లోడ్ చేసుకుని యిబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయాలని సూచించారు. ర్యాగింగ్ కారణంగా ఆపదలో ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని ఇది 24 గంటలు పని చేస్తాయని తెలిపారు.ఎవరైనా విద్యార్డులు ర్యాగింగ్ చేసి దోషులుగా నిరూపణ అయితే వారిని విద్యా సంస్థల నుండి సస్పెండ్ చేస్తారని,అది విద్యార్ది భవిష్యత్ పై మచ్చ పడుతుందన్నారు. విద్యార్థులు వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని మసలుకోవాలని సూచించారు. చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలని చెడు సావాసాలు అలవాటు చేసుకోకూడదని హితవు పలికారు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని చట్టానికి ఎవరూ అతీతులుకారని, తప్పు చేస్తె ఎంతటి వారైనా శిక్షార్హులేనని జడ్జి అన్నారు.
అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జె.సౌమ్యా జాస్ఫిన్ మాట్లాడుతూ ర్యాగింగ్ వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు చాలా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు వారియొక్క ఆలోచనా ధోరణి మెరుగు పరుచుకోవాలని సూచించారు. సమస్యలను ఎదుర్కొనే దైర్యం విద్యార్థులలో ఉండాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను మహిళల రక్షణ కొరకు రూపొందించారని వివరించారు.
అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. వెంకటరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై శ్రద్ద పెట్టి ఉన్నతపదవులు సాధించాలని, పార్వతీపురం నుండి సుమారు 36 మంది జడ్జిలుగా ఎంపికైయ్యారని తెలిపారు. మన జిల్లా నుండి నాలుగు హైకోర్టు న్యామూర్తులుగా పని చేశారని, ఇప్పుడున్న జిల్లా జడ్జిగారు కూడా పార్వతీపురం వారేనని వివరించారు. కళాశాలల్లో ఏమైనా సమస్యలు వస్తే వెంటనే ప్రిన్సిపల్, తల్లిదండ్రులకు తెలపాలని సూచించారు.
లోక్ అదాలత్ మెంబర్ టి. జోగారావు మాట్లాడుతూ చట్టాలపై ప్రతీ విద్యార్దికి అవగాహనా కలిగి ఉండాలన్నారు. బ్యాధ్యతలు, హక్కులు తెలుసుకోవడం వల్ల క్రమశిక్షణతో ఉంటారని పేర్కొన్నారు. ఎవరైనా తప్పు చేస్తే కోర్టులు కఠిన శిక్షలు వేయడానికి కూడా వెనకాడని అన్నారు.ఈసందర్భంగా పదవ తరగతి, మొదటి సంవత్సరం ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్దినులకు మెడల్స్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పెంట అప్పారావు, సీనియర్ లెక్చరర్ వివేకానంద, సిబ్బంది, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నార
ఈసందర్భంగా పదవ తరగతి, మొదటి సంవత్సరం ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్దినులకు మెడల్స్ తో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పెంట అప్పారావు సీనియర్ లెక్చరర్ వివేకానంద మరియు సిబ్బంది, కళాశాల విద్యార్థినిలు, విద్యార్థులు పాల్గొన్నారు.