శృంగవరపుకోట
ఎంపీపీ సోమేశ్వరరావు, వైసిపి పట్టణ అధ్యక్షుడు రెహమాన్ ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఎస్ కోట జడ్పిటిసి వెంకటలక్ష్మి తలపై వాటర్ బాటిల్ తగిలి స్వల్ప గాయమైంది.
వివరాల్లోకి వెళితే శృంగవరపుకోట మండలం లో ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ కార్యక్రమం బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. పట్టాల పంపిణీ జరుగుతున్న సమయంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు రెహమాన్, ఎంపీపీ సోమేశ్వరరావును అభ్యంతరకర మాటలతో దూషించడంతో ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్లతో దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమక్షంలో తనపై దాడి చేయడం అమానుష మని ఎంపీడీవో కార్యక్రమానికి ఆహ్వానిస్తే తాను వచ్చానని సోమేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి సమక్షంలో నాకు అవమానం జరిగిందని రెహమాన్ పై చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ ను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇద్దరినీ వారించడంతో వివాదం సద్దుమణిగింది.