విజయనగరం జిల్లా
రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించుటకుగాను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాల మేరకు గురువారం విజయనగరం మండలంలోని జాన్నవలస గ్రామంలో విజయనగరం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాసరావు,రూరల్ ఎస్ఐ శ్రీ ఆర్.వాసుదేవ్ ఆధ్వర్యంలో కేంద్ర పోలీసు బలగాలు (CAPF), సివిల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత యుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహకరించ వద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం అందించాలని ప్రజలను కోరారు.