పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో దాసరి వీధిలో గురువారం మధ్యాహ్నం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ నియంత్రిక వద్ద మంటలు అదుపు చేసేందుకు స్థానికులు అందుబాటులో ఉన్న ఇసుకను మంటలపై వేసి ఆర్పారు. ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు వస్తున్నాయని వీటిని నివారించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరారు.