సాలూరు పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది
కొత్తమ్మ తల్లి ఆలయ ప్రతిష్టా మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది
కొత్తమ్మ తల్లి ఆలయ ప్రతిష్టకు పోటెత్తిన భక్తజనం
పార్వతిపురంమన్యం జిల్లా
సాలూరు పట్టణం మెంటాడ వీధిలో శ్రీశ్రీశ్రీ కొత్తమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బుధవారం ఉదయం10 గంటల 09 నిమిషములకు జరపబడింది..
కొతమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట లో భాగంగా ఉదయం 10:09 నిమిషములకు యంత్రస్థాపన, అమ్మవారి ప్రాణప్రతిష్ట, కలస స్థాపన,అమ్మవారికి పూజ, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు భక్తుల సమక్షంలో చేపట్టడం జరుగుతుంది
అమ్మవారి దర్శనం కు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
ప్రతిష్ట అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు అన్న వితరణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది..