పాచిపెంట, మార్చి 28 : అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు సాలూరు శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి సి. విష్ణు చరణ్ గురువారం తనిఖీ చేశారు. పి కోనవలస, పద్మాపురం చెక్ పోస్టులను తనిఖీ చేశారు. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా , ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లు వద్ద నిరంతర పటిష్ట నిఘా ఉండాలని ఆయన అన్నారు. నమోదయిన కేసుల వివరాలు, సీజ్ చేసిన వాహనాల వివరాలు, పట్టుబడిన నాటు సారా, ద్విచక్ర వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమ మద్యం, నగదు తరలించకుండా 24 గంటలు పటిష్ట నిఘాను పెట్టాలని సూచించారు. చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ద్వారా చెక్ పోస్ట్ తనిఖీలను కంట్రోల్ రూమ్ నుండి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పని తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏ విధమైన ఉదాసీనతను ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. వెబ్ కాస్టింగ్ విధిగా చేయాలని ఆయన అన్నారు. తహశీల్దార్, ఎఫ్ ఎస్ టి బృందాలు నిఘా ఉండాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.