స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల తనిఖీ 

పార్వతీపురం సాధారణ ఎన్నికలకు ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలను పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. మౌళిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.   స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలలో కల్పించవలసిన మౌళిక సదూపాయాలు, తీసుకోవలసిన భద్రతా ఏర్పాట్లను గురించి సిబ్బందికి ఆదేశాలు జారీచేసారు.  నిరంతరం సి.సి. కెమెరాలు పర్యవేక్షణ, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలని స్పష్టం చేశారు. బారికేడ్లు ఏర్పాటు, రాత్రి వేళలలో వెలుగు ఉండేలా విద్యుత్ సదుపాయం, రక్షిత విద్యుత్ వైరింగు చేయాలని సూచనలు  చేసారు. వాహనాలు పార్కింగు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు.  నియోజకవర్గాలవారీగా  రిసెప్షను సెంటరు ఏర్పాటు, మీడియా సెంటరు ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి జి.కేశవనాయుడు, రెవిన్యూ డివిజినల్ అధికారులు  కె.హేమలత, ఎ.వి.రమణ, జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి డా ఎం వి ఆర్ కృష్ణా జి, డుమా పి.డి. కె రామచంద్రరావు, రోడ్లు భవనాలశాఖ ఇంజినీరింగ్ అధికారి ఎస్ వేణుగోపాల రావు, డిఇ అప్పాజీ, ఇన్ చార్జ్ ప్రిన్సిపాల్ ఆర్. రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *