పార్వతీపురం మన్యం జిల్లా
మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీలో కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి ఇంటింటికి ప్రచారం చేసి, కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ
పెన్షన్ డబ్బులను వైసీపీ ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్ లకు చెల్లించి, పెన్షన్లు ఇవ్వటానికి డబ్బులు లేక ప్రతిపక్షాలపై బురద జల్లుతుందని, వాలంటీర్లును, ఉద్యోగస్తులుగా కాకుండా పార్టీ కార్యకర్తలు గా ఉపయోగిస్తున్నారు. వృద్ధులు చనిపోతే టీడీపీ వల్లే చనిపోయారని దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని తెలిపారు.
మక్కువ మండల ఆడపిల్లగా నన్ను అభిమానించి, సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్ నాయుడు , గ్రామ నాయకులు అల్లు అప్పలనాయుడు , ఏ సింహాచలం, బి వాసుదేవరావు, తవితనాయుడు, జి భూషణ్, బుడిసెట్టి గౌరీ, మింది సింహాచలం, మింది శ్రీను, మచ్చ భాస్కరరావు, ఏ తిరుపతి, ఏ మన్మధ, ఆర్ రమణ, కేశవ, స్వామి నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.