రూ. 5 లక్షలు ప్రకటించిన మంత్రి సంధ్యారాణి
సాలూరు శ్యామలాంబ పండగను వచ్చేయేడాది మే నెల 18, 19, 20 తేదీల్లో జరిపేందుకు ఉత్సవ కమిటీ, పెద్దలు నిర్ణయించారు. పండగను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిధుల సమీకరణపై ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో చర్చించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయడంతో పాటు తనవంతుగా పండగకు 5 లక్షల రూపాయలు విరాళాన్ని మంత్రి ప్రకటించారు. తర్వాత రవ్వా శ్యామ్ శంకర్ 1.00116 రూపాయలు, కర్రి వెంకట్రావు 1,11,116, గంట వెంకట రాజు 20వేల రూపాయలు, ఇందుపూరి నారాయణరావు లక్ష రూపాయలు, జరజాపు సూరిబాబు 101016 రూపాయలు, అక్యాన అప్పారావు 11,1116, ఇతర భక్తులు తమ వంతుగా విరాళాలను ప్రకటించారు.