పాలకొండలో దుర్గమ్మను దర్శించి, ఏర్పాట్లు పరిశీలిన
సీతంపేట పోలీస్ స్టేషన్ భవనం పనులు పరిశీలన
పాలకొండలో పెట్రోల్ బంక్ కి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరణ
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కోట దుర్గమ్మ దసరా శరన్నవరాత్రులు ఉత్సవాల ఏర్పాట్లు ,బందోబుస్తు వివరాలు అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి శుక్రవారం సీతంపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. నూతనంగా నిర్మిస్తున్న సీతంపేట పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాన్ని , చుట్టుపక్కల పరిసరాలను మరియు రక్షణ కొరకు ఏర్పాటు చేసిన సెంట్రీ పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించారు. భవననిర్మాణ పరిశీలనా అనంతరం సీతంపేట ఎస్ఐ వాటికి సంభందించిన వివరాలు అడిగి తెలుసుకొని, తగు సూచనలు ,సలహాలు ఇచ్చారు.
తదుపరి పాలకొండ లో శ్రీ కోట దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు.ముందుగా అమ్మవారిని దర్శించుకొని ప్రతీ సంవత్సరం ఘనంగా నిర్వహించే దసరా ఉత్సవాల గురించి అధికారులును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం,క్యులైన్ లో భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ముఖ్యంగా తోపులాటకు తావు లేకుండా ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా గట్టి భద్రతా చర్యలను తీసుకోవాలని, వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా,వారితో మర్యాదగా ప్రవర్తిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ట్రాఫిక్కు అంతరాయంకలగకుండా వాహనాల పార్కింగ్, దారి మళ్లింపు ఉన్న ప్రతి చోటా సూచిక బోర్డులు ఏర్పాటు చేసేలా, ఎంట్రీ & ఎగ్జిట్ గేటుల వద్ద భక్తులకు సమాచారం పూర్తిగా తెలిసేలా హెల్ప్ డెస్క్ లను సిసి కెమరాల ద్వార పర్యవేక్షణ, రెవెన్యూ యంత్రాంగం, దేవాదాయ శాఖ ప్రోటోకాల్ సిబ్బంది, మున్సిపల్ తదితర సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఆటంకం కలగకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతం పాలకొండ లో పెట్రోల్ బంకు నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.
ఎస్పీతోపాటు పాలకొండ డిఎస్పీ ఎం.రాంబాబు,పాలకొండ సిఐ సిఎచ్.చంద్రమౌళి, సీతంపేట ఎస్ఐ జగదీశ్ నాయుడు పాల్గొన్నారు.