పాఠశాల విద్య, లైబ్రరీల అభివృద్ధికి సలహాలు, సూచనల స్వీకరణ
ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో మంత్రి లోకేష్
పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఉండవల్లి నివాసంలో ఉన్నతస్థాయి అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ –టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇందులో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరం భాగస్వాములం అవుతాం. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతంపై చర్చించాలని కోరారు.. త్వరలో అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించాం అన్నారు. పాఠశాల విద్య రోడ్ మ్యాప్, 117 జీవో, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఉపాధ్యాయులు, సంఘాల కోరిక మేరకు దసరా సెలవులు అక్టోబర్ 3 నుండే ఇవ్వాలని తీర్మానించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.