పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహించిన నిజం గెలవాలి యాత్రలో తెదేపా జనసేన నాయకులు కార్యకర్తలు యువతలో ఉత్సాహం ఉరకలేసింది. ఎన్నికల కురుక్షేత్రానికి మీరు సై నా అని ఆమె అంటే సై సై అంటూ యువత నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడిద్దామా అని ఆమె అడగ్గా అందరూ ఓడించడానికి మేము సిద్ధం మేము సిద్ధం అని నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వంపై యుద్ధం చేయాలని అన్నారు. సభ అనంతరం పొలిట్ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి టిడిపి జనసేన కండువాలు గాలిలో తిప్పుతూ సైకో పోవాలి సైకిల్ రావాలి అనే పాటతో యువతలో ఉత్సాహాన్ని నింపారు దీంతో జాతీయ రహదారిపై యువకులు జెండాలు పట్టుకొని కేరింతలు కొడుతూ జై తెలుగుదేశం జై జనసేన అంటూ నినాదాలు చేసి స్టెప్పులు వేశారు.