ప్రకటించిన లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నియామకం అయ్యారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రకటన జారీ చేశారు. కమ్యూనికేషన్, ఐటి శాఖల కమిటీలో కలిశెట్టికి స్థానం దక్కింది. ఆయా శాఖల్లో అమలవుతున్న వివిధ పథకాల అమలుతీరు, సమీక్షలతోపాటు అవసరమైన మార్పులు చేర్పులకు సంబంధించి పార్లమెంటు కమిటీ సూచనలు చేయనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన కూడా చేయవచ్చును. కమిటీలో కలిశెట్టికి సభ్యునిగా స్థానం కల్పించడంతో ఆయన అనుచరులు, అభిమానులు, కూటమి నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.