రూ.15లక్షలు సీఎం సహాయనిధి చెక్కు బాధితునికి అందించిన ఎంపీ కలిశెట్టి
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జరజాం పంచాయతీ గిలివివాని పేట గ్రామానికి చెందిన గోలివి గణేశ్ గత కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు మంజూరైన రూ. 15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే *నడుకుదిటి ఈశ్వరరావు, బాధితుడు గణేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు బెండు మల్లేశ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.