సాలూరు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన మంత్రి, కలెక్టర్
వచ్చే నెల నుంచి మండలాల వారీగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( గ్రీవెన్స్) నిర్వహిస్తామని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు ప్రజల నుంచి సమస్యలు స్వీకరించారు. భూ సమస్యలపై ఎక్కువ మంది కలెక్టర్ కిఅర్జీలు ఇచ్చారు. కుటుంబ సమస్యలు, పత్రిక విలేకరి పై దాడి, పింఛన్ల మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు కేటాయింపు గతంలో నిర్మించుకున్నకున్న ఇళ్లు బిల్లులు చెల్లించలేదని తదితర సమస్యలపై కలెక్టర్కు ప్రజలు వినతులు సమర్పించారు. గ్రామాల్లో రోడ్లు కాలువలు పాఠశాల భవనాలు అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రిగారికి పలువురు కోరారు. గ్రీవెన్స్ అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇకపై మండలాల వారీగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహించి ప్రజల నుంచి సమస్యలు స్వీకరిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రతిరోజు క్యాంప్బ కార్యాలయంలో ప్రజాదబ్బారు నిర్వహించి ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. వాటిని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు కూడా చేపడుతున్నామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం ఏ సమస్య పరిష్కరించక పోవడంతో ప్రజలు ఆ ఇబ్బందులు ఇప్పుడు తెలియజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్, సబ్ కలెక్టర్ శ్రీవత్సవ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.