పొలం పిలుస్తోంది కార్యక్రమంలో అధికారులను కోరిన రైతులు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కురుకుట్టి సారిక రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతులకు వ్యవసాయ పంటలు, పశువుల పెంపకం, ఉద్యాన పంటల సాగు, తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ అధికారి పి. అనురాధ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఆశించిందని దీని నివారణకు ఇమా మెక్టీన్ బెంజోయేట్ పురుగుమందు ఎకరానికి 100 గ్రాములు చొప్పున పిచికారి చేయాలని వ్యవసాయ అధికారి సూచించారు. రాయితీతో వ్యవసాయ పరికరాలు యంత్ర సామగ్రి అందించాలని రైతులు అధికారులు కోరారు. కార్యక్రమంలో హెచ్ వో బి. ఝాన్సీ, సైంటిస్ట్ అను, వ్యవసాయ ఉద్యాన శాఖ సిబ్బంది పాల్గొన్నారు.