ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర
ఎన్నో ఏళ్లుగా పోడు బంజరు భూములు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం సర్వహక్కులు కల్పిస్తుందని ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక ఆవరణలో గురువారం భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 492 మంది రైతులకు 516 ఎకరాలు భూమి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 415 మంది రైతులకు ఇప్పటికే భూమి హక్కులు కల్పించాం అన్నారు. ఓట్ల కోసం ఎన్నికల సమయంలో టిడిపి నేతలు వచ్చి కళ్లబొల్లి కబుర్లు చెబుతారు. నమ్మొద్దన్నారు. 2014లో లేనిపోని హామీలు ఇచ్చి మహిళలు రైతులను మోసం చేశారన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ సభ్యురాలు వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, సువ్వాడ రామకృష్ణ భరత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.