నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కేసులు పెట్టాలి

గిరిజన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్

పార్వతీపురం మన్యం జిల్లా
మక్కువ మండలం నంద గ్రామం లో నకిలీ విత్తనాల కారణంగా పాడైన మొక్క జొన్న పంట ను ఏపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి తాడంగి ప్రభాకర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా  మాట్లాడుతూ నంద గ్రామానికి చెందిన గిరిజన రైతులు మెల్లిక సొన్న, బిడ్డిక లక్ష్మణ, టాడంగి రాజు తో పాటు 15 మంది మక్కవ లో ఉన్న  గున్నరాజు,  శ్రీనివాస రావు అనే వ్యాపారుల  వద్ద అడ్వెంట్ 9293 కంపెనీ మొక్క జొన్న విత్తనాలు కొనుగోలు చేసారు.  సుమారు 30 ఎకరాల్లో పంట వేశారు. విత్తనం నాటిన తరువాత ఎదుగుదల మందగించి పూర్తిగా వెన్ను రాలేదని పంట చేతికి వచ్చే సమయానికి గిడస బారిపోయి నాశనం అయ్యిందని, పశువుల ఎరువు, గోర్రిల ఎరువుతో పాటు రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడినప్పటికి పంట రాలేదని అన్నారు, విత్తనం నకిలీది కావడం వలన పూర్తిగా పంట పాడైంది. ఆవిషయం మండల వ్యవసాయ శాఖ అధికారులుకు తెలియచేసినా పట్టించు కోవడం లేదని అన్నారు.  మీ వద్ద రసీదులు వున్నాయా అని రైతులను అడిగారని అన్నారు. అమాయక గిరిజనులు, చదువు లేని వారు విత్తనాలు కొనడానికి షావుకారు లు వద్ద వెళితే షావుకారు లు మోసం చేశారని ఎటువంటి రసీదులు ఇవ్వకుండా విత్తనాలు, ఎరువులు అమ్ముతున్నారు అని గిరిజనులు తన దృష్టికి తీసుకు వచ్చారని అన్నారు. మోసం చేసిన వ్యాపారుల ను వదిలేసి అమాయక గిిజనులును రసీదులు అడగడం అంటే వ్యవసాయ అధికారులు వ్యాపారులకు  వత్తాసు పలుకడమే అన్నారు. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి నకిలీ విత్తనాలు తో గిరిజనులు ను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి., పూర్తిగా వేల రూపాయలు పెట్టుబడులు పెట్టిన తర్వాత పంట పోయిందని ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది అని, క్వింటా 2500/ రూపాయిలు అమ్ముడు పోతుందని ఆ లెక్కన ఎకరానికి 75000/ రూపాయిలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  లేకపోతే గిరిజనులు ను కదిలించి మండల వ్యవసాయ శాఖ అధికారులు ఎదుట, వ్యాపారుల ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో భాదిత ఆదివాసీ గిరిజనులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *