గాంధీజీకి నివాళులర్పించిన పుర అధ్యక్షురాలు పువ్వల ఈశ్వరమ్మ
అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన గొప్ప యోధుడు మహాత్మా గాంధీ అని సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఆమె, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. సత్యనారాయణ నివాళులర్పించారు. దేస్వాతంత్రంలో గాంధీజీ ఎంచుకున్న పోరాట మార్గాన్ని, దేశ సమైక్యతకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో పురపాలక అధికారులు, మెప్మా సీఎంఎం పుష్ప, సిబ్బంది పాల్గొన్నారు.