600 మందికి ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వైద్య శిబిరాన్ని క్లబ్ అధ్యక్షులు ఇండుపూరి నారాయణ రావు ప్రారంభించారు. గుండె, మెదడు, వెన్నుముక, నరాలు, కిడ్నీ, ఊపిరితిత్తులు, చర్మ, గర్బిణులు, స్త్రీలు, కీళ్లు, ఎముకలు, చిన్నపిల్లలు, ముక్కు, చెవి, గొంతు, కంటి , దంత వైద్య నిపుణులు పి సురేష్ కుమార్, కే సౌమ్య, సురేష్ రెడ్డి, చరిష్మా, రంజిత్ మనోహర్ ,రమణమూర్తి, శ్రీవిద్య, సూరజ్, కార్తీక్, వెంకటేశ్వర్, హేమంత్, శ్రీనివాస్ లు సుమారు 600 మంది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. క్యాంప్ చైర్మన్గా డాక్టర్ పెంట శ్రీనివాసరావు వ్యవహరించారు. వైద్యులు గణేశ్వరరావు, మోహన్ రావు, సంజీవు నాయుడు ,రామ్మూర్తి, చక్రపాణి, మాజీ అధ్యక్షులు కర్రి వెంకటరావు, జరజాపు సూరిబాబు, కార్యదర్శి ఎం. జగన్మోహన్రావు, వి అప్పలనాయుడు, ఎ.వి. రామారావు, గిరి రఘు తదితరులు పాల్గొని రోగులకు సేవలు అందించారు.