పెండింగ్ పనులు పూర్తి చేయండి

సాలూరు పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం పెండింగ్ పనులను పది రోజుల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆ శాఖ అధికారులకు ఐటిడిఏ పిఓ విష్ణు చరణ్ ఆదేశించారు. గురువారం సాలూరు విచ్చేసిన ఆయన అతిథిగృహం పనులను పరిశీలించారు. పనులు ఏ మేరకు జరిగాయి, ఎప్పటికి ప్రారంభించవచ్చు, తదితర విషయాలపై అధికారులతో చర్చించారు. వీలైనంత వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *