సీఎం, కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన విజయనగరం ఎంపీ
తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తుల కోసం తిరుపతి నుంచి ఢిల్లీ విమాన సర్వీసులును విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం ప్రారంభించారు. ఢిల్లీ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి ఢిల్లీకి విమానం సర్వీసులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరిన వెంటనే కొత్త సర్వీసులు ప్రారంభించినందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి భక్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.