ఛైర్మన్ దుబేను సత్కరించి, అభినందనలు తెలిపిన విజయనగరం ఎంపీ
ఐ.టీ, కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఛైర్మన్ నిషికాంత్ దుబే అధ్యక్షతన జరిగిన మొట్టమొదటి సమావేశంలో సభ్యునిగా హాజరై, చైర్మన్ నిషికాంత్ దుబేను దుస్సాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.