ఆకట్టుకున్న నృత్య నీరాజనం
సాలూరు పట్టణంలోని కామాక్షి అమ్మవారి ఆలయంలో బుధవారం రాత్రి అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. పలువురు నృత్యకారులతో ఆలయ ప్రాంగణంలో నృత్య నీరాజనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. పల్లకి సేవలో నృత్యకారులు, వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.