ఎన్నికల సిబ్బందికి ఇ.ఎస్.ఎమ్.ఎస్. యాప్ పై శిక్షణ

సాధారణ ఎన్నికలలో విధులు నిర్వహించే  తనిఖీ బృందాల సిబ్బంది  ఎన్నికల  సంఘం రూపొందించిన ఎన్నికల  జప్తు నిర్వహణ వ్యవస్థ (ఇ.ఎస్.ఎమ్.ఎస్.)యాప్  పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. 

సాదారణ ఎన్నికల శిక్షణా కార్యక్రమాలలో భాగంగా శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో తనిఖీ బృందాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ

  ఎన్నికల కమిషను ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎప్పటికప్పుడు మార్పులు, సాంకేతికత అందుబాటులోనికి తీసుకువస్తుందని తెలిపారు. అందులో భాగంగా తనిఖీ బృందాలు విధులకు సంబంధించి ఎన్నికల సమయంలో జప్తుచేసిన డబ్బు,యితర వస్తువులకు సంబంధించి ఎన్నికల  జప్తు నిర్వహణ వ్యవస్థ (ఇ.ఎస్.ఎమ్.ఎస్.) యాప్ రూపొందించడం జరిగిందన్నారు.   తనిఖీ బృందాలు వారు పట్టుకున్న డబ్బు,యితర వస్తువులను  ఈ యాప్ లో తప్పని సరిగా నమోదు చేయాలని,  కావున  యాప్ వినియోగంపై  పూర్తి అవగాహన కల్పించుకోవాలని తెలిపారు.  బ్యాంకులు నుండి అధికార కార్యకలాపాల కొరకు లేదా యితర అవసరాలకొరకు అధిక మొత్తంలో డబ్బులు డ్రాచేస్తే ఆ డబ్బులకు సంబంధించి  క్యూఆర్ కోడ్ యిస్తారని, దానిని  ఈ యాప్ ద్వారా దృవీకరణ చేసుకోవచ్చునని తెలిపారు.  తనిఖీ బృందాలు  ప్రజలు ఎంతవరకు డబ్బులు కలిగిఉండవచ్చు, ఎంత  మొత్తం సీజ్ చేయవచ్చు తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సాధారణ ప్రజలకు యిబ్బందులు కలుగకుండా తమ అధికార పరిధికి లోబడి విధులు నిర్వహించాలని తెలిపారు.  ఎన్నికల విధులలో నిర్లక్యంగా పనిచేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.   ఎన్నికల విధులు, యాప్ నిర్వహణపై  అనుమానాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని,  తనిఖీ బృందాల సభ్యులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేసుకొని వారి సందేహాలను  అందులో తెలియజేస్తే, వాటికి వెంటనే సమాధానాలు తెలియజేయటం జరుగుతుందని, తద్వారా అందరు సభ్యులకు అవగాహన కలుగుతుందని తెలిపారు.

  జిల్లా  ఎస్.పి. విక్రాంత్ పాటిల్  మాట్లాడుతూ 

తనిఖీ అధికారులు  తనిఖీలలో పట్టుబడిన, సీజ్ చేసిన వివరాలను తప్పనిసరిగా ఎన్నికల  జప్తు నిర్వహణ వ్యవస్థ (ఇ ఎస్ ఎమ్ ఎస్)యాప్ నందు నమోదు చేయాలని తెలిపారు.  జప్తు అనంతరం తీసుకొనే చర్యలు  ఈయాప్ నందు నమోదైన వివరాలు ఆధారంగానే ఉంటాయని కావున, సిబ్బంది ఎన్నికల సమయంలో పట్టుకొన్న ప్రతి కేసు వివరాలను  ఈయాప్ నందు నమోదు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి జాయింటు కలెక్టరు సి.విష్ణుచరణ్,    ఇంచార్జి జిల్లా రెవిన్యూ అదికారి జి. కేశవనాయుడు, తనిఖీ బృందాల నోడల్ అధికారి మరియు  సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి  ఎం.డి. గయాజుద్దీన్,  తనిఖీ బృందాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *