దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గురువారం దర్శించుకున్నారు.
అనంతరం, భక్తులతో మాట్లాడారు. వారికి ఏర్పాటు చేసిన వసతి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
భక్తుల నుండి వచ్చిన విశేషమైన స్పందనకు ఎంపీ చాలా ఆనందించారు. అనంతరం, కనక దుర్గమ్మ అమ్మవారిని ఆలయ ఈవోను కలిసి, దేవీ నవరాత్రుల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లు బాగున్నాయని అభినందించారు.