ప్రభుత్వానికి రూ. 5.60 కోట్లు ఆదాయం
సాలూరు నియోజకవర్గం లోని 13 మద్యం దుకాణాలకు 280 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సిఐ దాసు తెలిపారు. మక్కువ మండలంలో మూడు షాపులకు 108, పాచిపెంట మండలంలో మూడు దుకాణాలకు 74, సాలూరు మండలంలోని రెండు షాపులకు 39, సాలూరు పట్టణంలోని ఐదు షాపులకు 59 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. లాటరీ ద్వారా ప్రభుత్వం షాపులను కేటాయించనుందని సీఐ తెలిపారు.