పట్టణంలో వందల సంఖ్యలో నిలిచిపోయిన లారీలు
దసరా పండగ వస్తే లారీ మోటారు పరిశ్రమ కళకళలాడుతుంది. అలాంటిది దసరా శనివారం కావడంతో లారీ యజమానులు, కార్మికులు ఆకు పూజ మాత్రమే చేశారు. పట్టణంలోని లారీ యార్డుతో పాటు జాతీయ రహదారి, పుర వీధులలో రోడ్లన్నీ లారీలతో నిండిపోయాయి. వాహనాలకు వేలాదిమంది దసరా పూజలు చేశారు. పట్టణం నలుమూలలా దసరా పూజల సందడి నెలకొంది. కుటుంబ సభ్యులతో పాటు మోటార్ కార్మికులు పూజలు ఘనంగా నిర్వహించారు.