బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన
నియోజకవర్గంలోని విశ్రాంతి ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే
ఉపాధ్యాయ వృత్తి వెలకట్టలేనిది, ఉత్తమ సమాజ స్థాపన ఉపాధ్యాయులకే సాధ్యం అని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) అన్నారు.
బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయులను గురువారం బొబ్బిలి కోటలో సత్కరించారు. రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రౌతు రామ్మూర్తి నాయుడు, విజయనగరం జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు సుంకరి సాయిరమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అన్నారు. గురువు లేని సమాజమే లేదన్నారు. ఉత్తమ పౌర సమాజాన్ని స్థాపించగలిగే శక్తి ఉపాధ్యాయులకే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు , బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాంబర్కి శరత్, బొబ్బిలి నియోజకవర్గం కాపు శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నంది హరిప్రకాష్ , బాడంగి మండలం మాజీ ఎంపీపీ బొంతు త్రినాథ, 17వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి కింతలి బంగార్రాజు, 16 వ వార్డు ఇంచార్జ్ రాయపురెడ్డి గుణశీల రావు(భాను), టీడీపీ సీనియర్ నాయకులు కాకల వెంకటరావు, కంచి వెంకటరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.