వికాస తరంగిణి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు అవగాహన
ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వ్యక్తిగత ఆరోగ్యం పై కూడా శ్రద్ధ చూపాలని వికాస తరంగిణి అధ్యక్షులు విశ్వనాథ రామానుజ దాస్ అన్నారు. శనివారం పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యం, పరిశుభ్రత తదితర విషయాలపై అవగాహన కల్పించారు. తడి పొడి చెత్త తో పాటు మెడికల్ వేస్ట్ వంటివి సేకరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రాజీవ్, శానిటరీ సెక్రటరీలు సిబ్బంది పాల్గొన్నారు.