ముఖ్యమంత్రి మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నాటుబండ్లు ఇసుక ట్రాక్టర్ల యజమానులు
ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెలుగులు నింపారని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
ఉచిత ఇసుక పాలసీతో ట్రాక్టర్, యడ్లబండ్లతో నదులు, వాగులు, నుంచి ఎంత ఇసుక కావాలంటే అంత ఇసుక తీసుకుని వెళ్లవచ్చన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ నాటు బండ్లు, ఇసుక ట్రాక్టర్ యజమానులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేయాలని మంత్రి సంధ్యారానికి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు. గత వైసిపి పాలనలో ఇసుక అధిక ధరల కారణంగా నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. ఈ రంగంపై ఆధారపడి బతికిన కార్మికులు వాహన యజమానులు రోడ్డున పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 125 రోజులలో ఉచిత ఇసుక విధానం తీసుకురావటం వలన మాలో కొత్త ఆశలు చిగురించాయని, చంద్రబాబును జీవితాంతం మా గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటామని మంత్రి సంధ్యారాణికి పుష్పగుచ్చం అందించి ట్రాక్టర్ యజమానులు వారి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యజమానులు జి. నారాయణరావు, సత్యనారాయణ, శ్రీను, సంతోష్, శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.