యువరాజు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాటింపు
సాలూరు శ్యామలంబ పండగను వచ్చే ఏడాది మే నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తున్నామని, ఇందుమూలంగా పురప్రజలకు తెలియజేస్తున్నామని సాలూరు జమీందారు విక్రమ చంద్ర సన్యాసి రాజు (యువరాజు) ఆధ్వర్యంలో పండగ దండోరా వేశారు. పండగ ఏర్పాట్లు ఇప్పటినుంచే చేసుకోవాలని కోరారు. తొలుత యువరాజు ఇంటి వద్ద అనంతరం అల్లు, జన్ని కుటుంబీకులు ఇళ్ల వద్ద, అమ్మవారి గద్దె వద్ద దండోరా వేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు అక్యాన అప్పారావు, పట్టణ తెదేపా అధ్యక్షులు నిమ్మాది చిట్టి, చిన్ని, ఈశ్వరరావు, అశోక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.